Nayanatara: నయనతార పరిచయం అవసరంలేని పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇటీవల కేవలం అడపా దడప సినిమాలలో మాత్రమే నటిస్తూ పూర్తి సమయాన్ని తన పిల్లలతో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.. ఈమె వరుస సినిమాలలో నటిస్తూ భారీగా ఆస్తులు సంపాదించారు. పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులతో పాటు ప్రైవేటు ఖరీదైన భవనాలను కూడా కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా నయనతార మరో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.
తాజాగా ఈమె తన ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఇల్లు మాత్రం ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. అయితే తమిళనాడులో సెలబ్రిటీలందరూ నివసించే పోయేస్ గార్డెన్ లో ఈమె మూడు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారట అయితే ఈ భవనాన్ని తన అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ చేయించడమే కాకుండా ఒక స్టూడియోని కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తుంది.
ఇలా మొదటి ఫ్లోర్ మొత్తం స్టూడియో కోసం కేటాయించగా మిగిలిన రెండు ఫ్లోర్లు తన కుటుంబం కోసం అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేయించుకున్నారని తెలుస్తోంది. ఇంత విలాసవంతమైన ఇంటిని నయనతార కొనుగోలు చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఇంటి ధర తెలిస్తే మాత్రం గుండెలు బద్దలు కావాల్సిందే. ఈ ఇంటి కోసం నయనతార అక్షరాల 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక ఈ ఇంటి ధర తెలిసి నేటిజెన్స్ కూడా షాక్ అవుతున్నారు.