దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒక్కో సినిమాకు సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.ఇలా తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్న నయనతార ఈనెల 9వ తేదీన పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ క్రమంలోనే ఈమె పెళ్లి పనులు శర వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
గతంలో ఈమె ఇతరులతో ప్రేమలో పడినప్పటికీ వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు. అయితే గత కొంత కాలం నుంచి నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేరుకున్నప్పటికీ పెళ్లి మాత్రం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్ళికి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం. ఇకపోతే తాజాగా నయనతార పెళ్లి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నయనతార పెళ్లిని ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శక పర్యవేక్షణలో వీరి వివాహం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా వీరి వివాహాన్ని ఓటీటీ ప్రసారం కావడానికి కారణం కేవలం డబ్బు కోసమే అని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా నయనతార తన ప్రియుడు విగ్నేష్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి తమ పెళ్లికి ఆహ్వానించినట్లు సమాచారం. ఎంతో మంది సినీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య నయనతార వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది.