‎Chiranjeevi: చిరంజీవి,అనిల్ రావిపూడి కాంబో మూవీ.. సీన్స్ లీక్ చేసేసారుగా!

‎‎Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమాణులు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమాను యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

‎ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సంగతి పక్కనపెడితే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్‌ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ కేరళలో జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక సీన్‌ షూట్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://twitter.com/Nayan_Universal/status/1946137362440077551?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1946137362440077551%7Ctwgr%5E82637d9a54cb06bfbf703505ab74d562b428649c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fchiranjeevi-and-nayanthara-are-shooting-anil-ravipudi-upcoming-film-2509330

‎నీటిలో పడవపై మెగాస్టార్, నయనతార కూర్చుని ఉండగా పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కేరళలోని అలప్పుజలో చిరంజీవి, నయనతారలపై పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వీడియో లీక్ పై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.