Nayanatara: నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. కేవలం 50 సెకండ్ల ప్రకటన కోసం అంత రెమ్యూనరేషనా?

Nayanatara: మామూలుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు క్రేజ్ ఉన్నప్పుడే కూడా ఏదైనా సాధ్యం. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే సినిమాలలో నటించడంతోపాటు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తూ ఉంటారు. అలా కెరిర్ బాగా సాగిపోతున్న సమయంలో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు అవకాశాలు రావడం కాస్త కష్టం అని చెప్పాలి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత సినిమా ఇండస్ట్రీ వారికి బాగా సరిపోతుందని చెబుతుంటారు.

అయితే ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఎందుకంటే చాలా కష్టపడి నయనతార ఒక స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. తర్వాత కోలీవుడ్‌లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్‌ కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్‌ ఇప్పటికీ స్టార్‌ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు.

అలాగే సినిమాలను నిర్మిస్తూ కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నయన్ ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అంటే ఈమె ఒక సెకన్‌ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం. నయనతార సాధారణంగా యాడ్స్‌ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్‌ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్‌ కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్‌ కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.