యూకే పై ట్రావెల్ బ్యాన్ విధించిన ఆ దేశాలు..ఎందుకంటే ?

యూకే లో కొత్త రకం కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ కారణంతో ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలతో పాటు మరి కొన్ని దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిషేధించాయి. యూకే నుంచి ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా దేశాలు నిన్న ప్రకటించాయి.

First arrivals under UK quarantine rules: 'They didn't even check my  temperature' | World news | The Guardian

యూరప్ కు వెలుపల ఉన్న సౌదీ అరేబియా, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలు యూకే నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశాయి. మరోవైపు నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియాల్లో కూడా కొత్త వైరస్ ను గుర్తించారని బీబీసీ ప్రకటించింది. ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ఒక వ్యక్తిలో కొత్త వైరస్ ను గుర్తించామని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి నిన్న రాత్రి ప్రకటించారు.

సదరు వ్యక్తికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరినీ ఐసొలేషన్ లో ఉంచామని చెప్పారు. యూకే నుంచి ట్రావెల్ బ్యాన్ పై డిసెంబర్ 31న సమీక్ష నిర్వహించి, తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామని జర్మనీ నిన్న రాత్రి తెలిపింది. 48 గంటల పాటు యూకే నుంచి వచ్చే విమానాలు, ఫెర్రీలపై నిషేధం విధిస్తున్నామని, మంగళవారం నాడు దీనిపై సమీక్ష నిర్వహిస్తామని ఐర్లండ్ ప్రకటించింది.