యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో వలస విధానాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం తాజా నిర్ణయాలతో భారతీయుల సహా అనేక వలసదారులపై ప్రభావం చూపనుంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగ లక్ష్యాలతో యూకే ప్రయాణించాలనుకునే యువతకు ఇది మినిమమ్ షాక్‌గా మారుతోంది.
విద్యార్థులకు 2 ఏళ్ల పోస్ట్ స్టడీ వీసా గడువును 18 నెలలకు తగ్గించడం, వీసా విధానంలో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని తప్పనిసరి చేయడం వంటి అంశాలు భారత విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. స్కిల్డ్ వర్క్ వీసా కోసం ఇకపై డిగ్రీ విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. గతంలో ఏ-లెవెల్‌తో సరిపోతుండేది.
ఇంకా శాశ్వత నివాసానికి (ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్) న్యాయంగా అర్హత పొందాలంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఉండే నిబంధనను 10 సంవత్సరాలకు పెంచారు. ఇది పౌరసత్వం పొందాలనుకునే వారి ఆశలను మరింత పొడిగించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, భార్య భర్తలు వంటి కుటుంబ సభ్యులను వీసాతో తీసుకురావడంపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
యూకే వలస ప్రణాళికలు చేసుకుంటున్న వారు ఇకపై చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు అడ్డంకులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇతర యూరోప్ దేశాల వైపు దృష్టి సారించే అవసరం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. వీసా నిబంధనలు మరింత కఠినమవుతున్న వేళ, అభ్యర్థులు ముందుగానే ప్రిపరేషన్‌తో ఉండటం తప్పనిసరి.