దేశ వ్యాప్తంగా కరోనా పంజా ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తును నమోదవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి కరోనా పరిస్థితుల పై ఆరా తీశారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల పై అడిగి తెలుసుకోవడమే కాకుండా, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు మోదీ.
ఇక లాక్‌డౌన్ మినహాయింపులు తర్వాత కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపధ్యంలో, కరోనా వైరస్ కట్టడికోసం తీసుకుంటున్న చర్యలు, కరోనా పేషెంట్లలకు అందిస్తున్న చికిత్సకు సంబంధించి వివారాల పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కరోనా టెస్ట్‌ల సంఖ్య పెంచామని, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, ఇద్దరు ముఖ్యమంత్రులు తెలిపారు. అలాగే కేసులు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధుస్తున్నామన్నారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ, కరోనా సంక్షభ సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.