నరసపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన రెబెల్ వైయస్ఆర్సిపి ఎంపి కె రఘురామ కృష్ణంరాజు పార్టీ నాయకత్వాన్ని రెచ్చగొట్టడానికి, పార్టీ నుండి బహిష్కరింపబడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
శుక్రవారం, తన స్వస్థలమైన భీమవరం వద్ద తన పార్టీ కార్యాలయానికి కొత్త పేరు వచ్చింది.
ఇంతవరకు, కార్యాలయం పేరు: “వైయస్ఆర్ కాంగ్రెస్ నరసపురం ఎంపి కార్యాలయం” అని ఉండేది. దీనిని ఇప్పుడు “యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం” గా పేరు మార్చారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పార్టీ కార్యాలయంలో ఇప్పటికీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి మరియు పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రఘురామ కృష్ణంరాజు చిత్రాలు అలాగే ఉంచుతూ తాను ఇంకా వైస్సార్సీపీ నాయకుడినే అని సంకేతాలు పంపుతున్నారు.
అయితే, ఇప్పటివరకు పార్టీ కార్యాలయం గోడలను అలంకరించిన వైయస్ఆర్సి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయ్ సాయి రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానమ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చిత్రాలు తొలగించబడ్డాయి.
రఘురామ కృష్ణరాజు ప్రధాన ఆరోపణ తనపై సాయి రెడ్డి కుట్ర పన్నారని చెబుతున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో రఘు రామ కృష్ణంరాజు కి సాయి రెడ్డి షో కాజ్ నోటీసు జారీ చేశారు. తనకు నోటీసు ఇచ్చే ముందు క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయలేదని, అక్కడ ఏమి చర్చించకుండానే తనకు నోటీసు పంపారు అని రఘు రామ కృష్ణంరాజు ఆ నోటీసును తిరస్కరించారు.కార్యాలయానికి ” వైయస్సార్ కాంగ్రెస్” అనే పేరు తీసేసిన వైసీపీ ఎంపీ.