జగన్ సర్కార్ ని ఇరుకునపెట్టాలనే అత్యుత్సాహమో.. లేక, తన గురించి తాను ఎక్కువ ఊహించుకోవడంలో భాగమో.. అదీగాకపోతే, పార్లమెంటులో తనకు మించిన మగాడు లేడనే భ్రమో తెలియదు కానీ.. తాజాగా ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అత్య్త్సాహం ప్రదర్శించారని తెలుస్తుంది. ఫలితంగా… మరో వైసీపీ ఎంపీ ఫుల్ గా వాయించారని అంటున్నారు.
అవును… ఏపీలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ గుర్తుపై ఎంపీగా గెలిచారు రఘురామ కృష్ణం రాజు. అయితే అనంతరం కాలంలో రెబల్ గా మారారు. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించేవారు. అయితే ఈ విషయంలో ఆర్.ఆర్.ఆర్. ను వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు. ఆయన చేసే ఏ విమర్శకూ స్పందించేవారు కాదు.
దీంతో అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కు అనూకూల వ్యాఖ్యలు చేస్తూ, జగన్ సర్కార్ ని దుమ్మెత్తిపోస్తూ పసుపు మీడియా ముందు రచ్చబండ కార్యక్రమం చేసుకుంటూ గడిపేస్తున్నారు ఈ వైసీపీ రెబల్ ఎంపీ. ఈ నేపథ్యంలో గతకొంతకాలంగా హస్తినకే పరిమితమైన ఆర్.ఆర్.ఆర్. ఈ రోజు మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా… అత్యుత్సాహం ప్రదర్శించారంట.
అందులో భాగంగా… వైజాగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో స్పీకర్ ఓం బిర్లాకు, హోంశాఖ కార్యదర్శికి కూడా రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్ హాల్ కు వచ్చిన వైజాగ్ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తారసపడ్డారు. అంతే రఘురామపై ఎంవీవీ రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.
నా కుటుంబం గురించి స్పీకర్, హోంశాఖకు లేఖలు రాయడనికి నువ్వెవడు అంటూ రఘురామను వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ ఏదో సర్దిచెప్పబోయారట. అయినా కూడా ఎంవీవీ శాంతించలేదని తెలుస్తుంది. ఇలా వివాదం పెద్దదవుతున్న తరుణంలో మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వచ్చి ఎంవీవీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని అంటున్నారు.
ఈ సమయంలో ఒక దశలో ఎంవీవీ కాస్త శృతి తప్పారని కూడా అంటున్నారు. బూతు మాటలు కూడా తిట్టారని… తన ఫ్యామిలీ మ్యాటర్ లో నీ అత్యుత్సాహం ఏమిటి అని తీవ్ర పదజాలం వాడుతూ.. రాయలేని భాషలో నిప్పులు చెరిగారని అంటున్నారు. దీంతో షాకైన రఘురామ అనంతరం సైలంట్ అయిపోయి సైడ్ అయిపోయారని సమాచారం.