Nara Lokesh : ఎటూ తేల్చుకోలేకపోతున్న నారా లోకేష్.! కారణమిదేనా.?

Nara Lokesh : వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని అంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రచారం సమయంలోనూ, కౌంటింగ్ సమయంలోనూ.. నారా లోకేష్ అండ్ టీమ్ చేసిన యాగీ అంతా ఇంతా కాదు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి.
నారా లోకేష్‌ని ఓడించడానికి ఈవీఎం ట్యాంపరింగ్ కూడా చేశారంటూ అప్పట్లో టీడీపీ ఆరోపించింది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే వున్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఓటమిని టీడీపీ జీర్నించుకోలేకపోయింది. పార్టీ అధినేత తనయుడు, అందునా మంత్రి ఓడిపోవడం.. పెద్ద విషయమే మరి.
ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ విషయమై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేష్ ప్రకటించినా, నియోజకవర్గం మారే అవకాశాలు లేకపోలేదట.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గన్నవరం నియోజకవర్గం మీద నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ నుంచీ నారా లోకేష్ పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా కూడా సమాలోచనలు జరుగుతున్నాయట.
మరోపక్క, నారా లోకేష్ తాను గుడివాడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో వున్నట్లు సన్నిహితులతో చెప్పారంటూ ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. వీటిల్లో ఏది ఫైనల్ అవుతుందోగానీ, పోటీ చేసే నియోజకవర్గంపై వీలైనంత త్వరగా స్పష్టతకు రాకపోతే కష్టమేనన్నది తెలుగు తమ్ముళ్ళ ఉవాచ.