ఏపీలో ప్రస్తుతం ఆలయాల రాజకీయ జరుగుతుంది. వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో టీడీపీ , వైసీపీ ఒకరిపై మరొకరు దీనికి కారణం నువ్వు అంటే నువ్వు అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫేక్ పార్టీ, ఫేక్ సీఎం.. తన డెకాయిట్ బ్యాచ్ తో ఫేక్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏ1 క్రిమినల్ సీఎం..తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడు. నీ బతుకు ఫేక్. నీ పార్టీ ఫేక్. నీ హామీలు ఫేక్. నీ పాలన ఫేక్. చివరికి నాపై నీ దొంగల బ్యాచీతో చేయించే ఆరోపణలూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది. (1/2)
— Lokesh Nara (@naralokesh) January 1, 2021
తనపై చేసిన ఆరోపణలన్నీ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలిపోయిందన్నారు. ఎన్నాళ్లీ దొంగ ఆరోపణలు చేస్తారని సీఎంను ప్రశ్నించారు. దమ్ముంటే సింహాచలం అప్పన్న ఆలయానికి రావాలని.. నాపై చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ప్రమాణం చేయాడానికి నేను సిద్దం.. నువ్వు సిద్ధమా? అంటూ నారా లోకేష్ ఛాలెంజ్ విసిరారు.
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో దేవుళ్లకే రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ అలసత్వం వల్లే దాడులు చోటు చేసుకుంటున్నాయి. కనకదుర్గమ్మ గుడిలో మాయమైన సింహాల ప్రతిమలు ఇప్పటికీ గుర్తించలేదని… అంతర్వేది రథంతగలబెట్టిన నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని ఆయన విమర్శించారు