Nagababu: ఆ విషయంలో జనసేన టీం ఇండియా రెండో ఒకటే… నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

Nagababu: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫినాలే ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ పై ఇండియా విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఈ విధంగా ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించడంతో ఎంతోమంది ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ సక్సెస్ చేసుకుంటున్నారు.

ఎంతోమంది ప్రముఖులు కూడా టీమిడియాకు విష్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు అదేవిధంగా మరికొంతమంది యువత అయితే బైకులపై ర్యాలీలు చేస్తూ కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో గెలవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ టీం ఇండియా విజయం పై నాగబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా నాగబాబు టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించడంతో టీం ఇండియాను అభినందించారు.అదృష్టానికి విజయంతో సంబంధం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అన్ని మ్యాచుల్లోనూ టాస్ ఓడి విజయాన్ని నమోదు చేసిందని, 12 ఏళ్లకు చాంపియన్స్ ట్రోఫీ సాధించిందని ఈయన గుర్తు చేసుకున్నారు.

జనసేన పార్టీ కూడా 12 ఏళ్లకు జీరో ఏమ్మెల్యే నుంచి వందశాతం స్ట్రైక్ రేటుతో 22 ఎమ్మెల్యేలు గెలిచిందన్నారు. ఈ విషయంలో టీమిండియా, జనసేన ఒక్కటే అని పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీని కూడా టీమ్ ఇండియాతో పోల్చి మాట్లాడటంతో ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు టీమిండియా ఎవరి సహాయం లేకుండా గెలిచారు మరి మీరు కూడా సింగిల్ గా పోటీ చేసి గెలిచారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.