Jabardasth Show: జబర్దస్త్ షో నుంచి మేము వెళ్లిపోలేదు.. వాళ్లే పంపించారు.. అసలు విషయం చెప్పిన ధనరాజ్

Jabardasth Show: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 12 సంవత్సరాల పాటు ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్స్ గా ఎన్నో విభిన్నమైన స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభంలో వేణు ధనరాజ్ అభి వంటి వారందరూ కూడా పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం వీరంతా వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఒక్కసారిగా సీనియర్ కమెడియన్ల అందరు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఎన్నో  సందేహాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన రాజ్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తెలియజేశారు.. తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోలేదని క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కార్యక్రమంలో మేము కమెడియన్స్ గా కొనసాగుతున్న సమయంలోనేఅలీ టాకీస్ షోకు వేణు, నన్ను యాంకర్లు చేయమని అడిగారు. ఇక ఎంతకాలం ఆర్టిస్ట్ లుగా చేస్తామని చేద్దామని అనుకున్నాం. కానీ జబర్దస్త్ నిర్వాహకులు, మల్లెమాలకు ఒక విషయం చెబుదామని అన్నాను. అందుకు వేణు సరేనని అన్నారు. నేను ఇదే విషయాన్ని శ్యామ్ ప్రసాద్ గారి అమ్మాయి మేడమ్  గారితో చెబితే ఆమె ఓకే అన్నారు.ఇలా వారు వెళ్ళమని చెబితేనే వెళ్ళాము అయితే అలీ టాకీస్ కేవలం 24 ఎపిసోడ్ లకే పూర్తీ అయింది. ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలోకి తిరిగి వెళ్దాము అనేసరికి మేము ఎంత తప్పు చేసామో అర్థమైంది అప్పటికే ఈ కార్యక్రమం నిర్వాహకులు మేము లేకపోవడంతో  ఎంతో ఇబ్బందులు పడుతూ మా స్థానంలో సుడిగాలి సుదీర్,రామ్ ప్రసాద్ లు, రాకింగ్ రాకేష్ లకు టీమ్ లీడర్లుగా అవకాశం ఇచ్చారు. ఇదంతా తెలిసికా మళ్లీ అవకాశం అడగలేకపోయాం. అందుకే జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యామని ఈ సందర్భంగా ధనరాజ్ తెలియజేశారు.