అర్ణబ్ గోస్వామి ఓ న్యూస్ ప్రజెంటర్… అతిపెద్ద మీడియా సంస్థకు అధిపతి … ప్రతీ రోజు ప్రైం టైంలో టీవీ స్కీన్ మీద జాతీయ స్థాయి అంశాలపై పెద్ద పెద్ద నేతలతో చర్చించే స్థాయి ఉన్న వ్యక్తి. అయితే ఆయనకు అదే అలవాటైపోయింది. మామూలుగా మాట్లాడినా న్యూస్ రూంలో మాట్లాడినట్లే మాట్లాడుతుంటాడట. న్యూస్ రూం అయన్ని ఆవహించేసిందట. ఏం చేస్తాం చెప్పండి. వార్తలే ఆయనకు ప్రాణం…పొద్దస్తమానం అదే లోకం, వార్తలే వృత్తి , ప్రవృత్తి, ఆదాయం, వ్యసనం… అన్నీ వార్తలే. ఇప్పుడు అదే పెద్ద పొరపాటై పోయింది.
ముంబై పోలీసులు ఎంచక్కా అరెస్టు వారెంట్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా అరెస్టుకు సహకరిస్తే సరిపోయేది… కాని చాలా హంగామా చేశాడు. అరెస్టు వారెంటు ఉన్నప్పుడు అరెస్టుకు సహకరించాలని తెలియదా? తెలుసు కాని ఏం చేస్తాం…నాలుగు విజువల్స్ దొరికితే తన రిపబ్లిక్ టీవీతో పాటు తన వర్గానికి చెందిన ఛానల్స్ లో పదే పదే చూపించి హాడవిడి చేయొచ్చని భావించాడు. సానుభూతి పొందొచ్చని భావించాడు. ఇప్పుడు అదే కొంప ముంచింది.
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా పోలీసు అధికారిపై దాడి చేశాడని కేసు పెట్టేశారు ముంబై పోలీసులు. ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకటించింది. అర్ణబ్ తో పాటు ఆయన భార్య, కుమారుడు తమ విధులకు భంగం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని కేసు పెట్టారు. లీగల్ టర్మినాలజీలో చెప్పాలంటే…అర్నాబ్ గోస్వామితో పాటు ఆయన భార్య, కుమారిపై సెక్షన్ 353 (ప్రభుత్వ సర్వంట్ తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడం, సెక్షన్ 504 (శాంతి భద్రతల ఉల్లంఘనను రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు ముంబై పోలీసులు.