అర్నాబ్ గోస్వామిని లోకేష్ మేనేజ్ చేశారా.?

కొన్నాళ్ళ క్రితం రిపబ్లిక్ ఛానెల్ నుంచి టీడీపీ అనుకూల సర్వే ఒకటి వెలుగు చూసింది. ఇప్పుడేమో, అదే రిపబ్లిక్ ఛానెల్‌లో నారా లోకేష్ సందడి చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి – నారా లోకేష్ ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

సాధారణంగా అర్నాబ్ గోస్వామి ఇంటర్వ్యూ అంటే, అవతలి వ్యక్తుల్ని అస్సలు మాట్లాడనివ్వడు. ఎంతటి ఉద్ధండులైనా, ఆర్నాబ్ ధాటిని తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఆర్నాబ్, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలా రిపబ్లిక్ ఛానల్ బీజేపీ ఛానల్ అయిపోయింది.

కాదు కాదు, బీజేపీనే రిపబ్లిక్ ఛానల్ పెట్టి, దాంట్లోకి ఆర్నాబ్‌ని తీసుకొచ్చింది. ఇది ఓపెన్ సీక్రెట్. ఆ ఛానల్‌లో నారా లోకేష్ వాగ్ధాటి, ఆర్నాబ్ సైతం తెల్లమొఖం వేయడం.. ఇదంతా నాటకీయంగా మారింది. ఇలా ఎలా జరిగిందబ్బా.? అని అందూ ముక్కున వేలేసుకుంటున్నారు.

నారా లోకేష్, జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవడానికి ముందు, ఢిల్లీలోని టీడీపీ బృందం, ఆయా మీడియా సంస్థల్ని మేగ్జిమమ్ మేనేజ్ చేశాయనే చర్చ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇంటర్వ్యూ అంటే, ఇంతర్వ్యూ కాదు.. అలాంటి ఓ పెయిడ్ స్లాట్.. అన్న ముందస్తు ప్లానింగ్‌తోనే ఇదంతా జరిగిందా.?

ఏమో, పొలిటికల్ మీడియాలో ఇప్పుడు ఏదైనా సాధ్యమవ్వొచ్చు. అయితే, నారా లోకేష్ కోసం నేషనల్ మీడియా ఇంత రిస్క్ తీసుకుంటుందా.? క్రిడిబులిటీని పోగొట్టుకుంటుందా.? ఏమో, ిందులో నిజమెంతో ఇప్పుడే చెప్పలేం.?

ఒక్కటి మాత్రం నిజం, ‘పప్పు’ అనే ఇమేజ్‌ని అయితే, నారా లోకేష్ ఈ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలతో పోగొట్టుకున్నాడు.