Bigg Boss 9: బిగ్‏బాస్ 9లో అవకాశం ఇవ్వకపోతే నిరాహార దీక్ష.. రోడ్డుపై బ్యానర్ కట్టి రచ్చ చేసిన మల్టీస్టార్ మన్మధ రాజ!

Bigg Boss 9: బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షో అయినా బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే. ఈ బిగ్ బాస్ షో ఇప్పటీ వరకు తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే బిగ్బాస్ షోలోకి సోషల్ మీడియా సెలబ్రిటీలు,సింగర్లు, డాన్సర్లు, నటీనటులు కమెడియన్లతో పాటు కొన్ని కొన్ని సార్లు నార్మల్ పీపుల్ ని కూడా పంపిస్తూ ఉంటారు. అయితే చాలామంది బిగ్ బాస్ షో కి మద్దతుగా మాట్లాడితే మరి కొంతమంది నెగటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇకపోతే మామూలుగా సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయితే చాలు అలాంటి వారిని వెంటనే బిగ్ బాస్ హౌస్ లోకి షో నిర్వాహకులు పట్టుకొస్తుంటారు.

ఇప్పటికే అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన చాలామందిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు బిగ్‏బాస్ ఛాన్స్ కావాలని రెడీ అయిపోతున్నారు. రైతు బిడ్డనంటూ సామాన్యుడిగా బిగ్‏బాస్ హౌస్ లోకి వెళ్లి విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. కానీ గ్రాండ్ ఫినాలే రోజే తన ప్రవర్తనతో విపరీతమైన నెగిటివిటీని మూట గట్టుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల కాలంలో బిగ్బాస్ రియాల్టీ షోలో మాకు కూడా అవకాశం ఇవ్వాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా తనకు బిగ్‏బాస్ కంటెస్టెంట్ గా అవకాశం ఇవ్వాలంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు బ్యానర్ కట్టేశాడు ఒక వ్యక్తి. అతడు మరెవరో కాదు.. మినిమల్ డిగ్రీ ఉండాలి అనే ఒక్క డైలాగ్ తో నెట్టింట ఫేమస్ అయిపోయాడు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. మినిమమ్ డిగ్రీ ఉండాలంటూ అతడు చెప్పిన ఒక్క డైలాగ్ తెగ మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో తనకు బిగ్‏బాస్ రియాల్టీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ ఏకంగా బ్యానర్ కట్టేశాడు. బిగ్‏బాస్ సీజన్ 9కి ఛాన్స్ ఇవ్వాలి.. లేదంటే నిరాహార దీక్ష చేస్తా.. మల్టీస్టార్ మన్మధ రాజ.. సినిమా యాక్టర్.. మినిమం డిగ్రీ అంటూ బ్యానర్ కట్టి అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాకు దిగాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇతడి కోరిక మేరకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం ఇస్తారేమో చూడాలి మరి.