Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా తప్పుకున్న నాగార్జున…. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రౌడీ హీరో?

Bigg Boss 9: బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఇప్పటికే ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది అయితే త్వరలోనే తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు అందుకు తగ్గ కసరత్తులు మొదలు పెట్టారని తెలుస్తోంది.

బిగ్ బాస్ 9 కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి హోస్టుగా నాగార్జున వ్యవహరించడం లేదు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. అనంతరం నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు.

ఇక నాగార్జున సీజన్ 9 కార్యక్రమానికి మాత్రం దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగర్జున ఈ కార్యక్రమానికి దూరమవుతున్న నేపథ్యంలో మరొక యంగ్ హీరోని హోస్ట్గా పరిచయం చేయబోతున్నారని సమాచారం. యూత్ లో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారు అంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ మేకర్స్ కూడా విజయ్ దేవరకొండను సంప్రదించడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

ఇలా విజయ్ దేవరకొండ సీజన్ నైన్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ నాగార్జున మాత్రం అధికారికంగా తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నాను అని మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇక విజయ్ దేవరకొండ నాగార్జున ఇద్దరు కూడా సినిమాలపరంగా ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నారు.