Bigg Boss 9: తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ఒకటి. ఈ కార్యక్రమం అన్ని భాషలలోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఏకంగా 8 సీజన్లను పూర్తి చేసుకుని తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది.
అయితే ఇటీవల కాలంలో డాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను లిరి పెద్ద ఎత్తున వార్తలో నిలిచారు. ఈమె ఢీ డాన్స్ షోలో పాల్గొని విన్నర్ కావడంతో ఒక్కసారిగా వార్తలో నిలిచారు. అంతే కాకుండా శేఖర్ మాస్టర్ ఈమెకు భారీ స్థాయిలో మోటివేట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇలా ఈ వార్తల ద్వారా జాను పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా జాను పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఈమె స్పందిస్తూ తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో ఇదివరకే రెండుసార్లు అవకాశం వచ్చిందని కానీ తాను వెళ్ళనని తెలిపారు. ఈసారి కూడా అవకాశం వచ్చిన తాను వెళ్ళనని ఈమె చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు.
నేను సున్నాల దగ్గర ఆగిపోయేదాన్ని కాదు.. రూ.1లక్ష, రూ.5లక్షలు ఇలా ఎంతైనా సరే ఈ జానుని డబ్బుతో ఎవరు కొనలేరు అంటూ ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూయిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా కొంతమంది ఇలా బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడి చివరికి ఆ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. మరి అదే తరహాలో జాను లిరి కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
