Bigg Boss 9 : త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9.. ప్రోమో రిలీజ్.. హోస్ట్ గా ఎవరో తెలుసా?

Bigg Boss 9 : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బిగ్ బాస్ షో తెలుగు తో పాటు ఇంకా చాలా భాషల్లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానుంది. 9వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్బాస్ షో నీ ఆదరించే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు కూడా అంతమందే ఉన్నారు.

పని పాట లేని షో అని, ఇలాంటి షో ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇలాంటి షోల కోసం కోట్లు ఖర్చులు చేస్తున్నారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా బిగ్ బాస్ షో మాత్రం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా 9 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో త్వరలోనే తొమ్మిదవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Bigg Boss Season 9 Coming Soon | Nagarjuna | Star Maa

ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో విడుదల చేసారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునే కనిపించారు. ఇటీవల హోస్ట్ ని మారుస్తామని రూమర్స్ వచ్చినా మళ్ళీ నాగార్జుననే తీసుకున్నారు. ఇక ఈ ప్రోమోలో నాగార్జున.. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అని చెప్తూ స్టైలిష్ గా కనిపించారు నాగ్. మరి ఈసారి బిగ్ బాస్ లో ఎవరెవరు ఆడతారో చూడాలి మరి. మొత్తానికి ఈ ప్రోమోతో త్వరలో బిగ్ బాస్ రాబోతోందని, అలాగే ఈసారి కూడా నాగార్జుననే హోస్టుగా వ్యవహరించబోతున్నారు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.