చంద్రబాబు – వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల విషయం లో ఈ పాయింట్ చాలామందికి తెలీదు !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నేత, తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్న ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రాజకీయాల్లో నూతన ఒరఓడిని సృష్టించిన మహా గొప్ప నాయకుడు. వైఎస్సార్ ప్రతిపక్షాల నాయకుల పట్ల కూడా ఆయన ధోరణి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి పక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో నిజం ఉంటే దాన్ని కూడా కన్సిడేర్ చేసే వారు. ప్రజలకు పథకాలుచేరవేసే సమయంలో పార్టీలకు అతీతంగా ఉండేవారు.

రాష్ట్రంలో వైఎస్సార్ కు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. చంద్రబాబుకు, వైఎస్సార్ కు మధ్యనున్న స్నేహపూర్వక సంఘటనను, వైస్సార్ సీబీన్ కు ఇచ్చే గౌరవం గురించి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఓ సారి పేపర్‌లో చంద్రబాబుపై ఓ కార్టూన్ వస్తే.. దాన్ని వైఎస్‌కు చూపించానని, అది చూడగానే ఆయన సీరియస్ అయిపోయారని అన్నారు. పేపర్‌ను గట్టిగా విసిరి కొట్టారని చెప్పారు. ఇదేం బాలేదు. చంద్రబాబు నాయుడు 9ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇది సరికాదు. ఆయనపట్ల గౌరవం ఉండాలని అన్నారట. ఆయనను చూసిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఇలాంటి మహానుభావులు ఉన్నారా అనుకుంటూ ఆయన సంస్కారానికి నమస్కారం పెట్టానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆయన ఏ స్కీమ్ పెట్టినా రాజీవ్, నెహ్రూల పేర్లే పెట్టారని చెప్పుకొచ్చారు. ఇతరులను గౌరవిస్తూ.. వ్యక్తిగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. సొంత పార్టీ పెట్టి నడిపించగలిగిన సత్తా ఉన్నా కూడా వైఎస్సార్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురుచెప్పేవాడు కాదని రాజకీయ ప్రముఖులు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకరినిఒకరు తిట్టుకోవడానికే సమయం ఉండటం లేదు. ఇప్పుడున్న రాజకీయ నేతలు వైఎస్సార్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు పట్ల వైఎస్సార్కు ఇంత గౌరవం ఉండేదని విషయం చాలా మందికి తెలియదు.