ఎమ్మెల్సీ విజయం.. కవిత కొంప ముంచిందా..?

mlc kavitha telugu rajyam

  నిజామాబాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే, 823 ఓట్లు గాను, 720 పైగా ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేసింది, కానీ ఆమెకు ఆ సంతోషం ఎక్కువగా సమయం లేకుండా పోయింది. దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలుసు, అందుకే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కవిత విజయం సాధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెరాస  పార్టీ నాయకులూ కార్యకర్తలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

kavitha kalvakuntla telugu rajyam

  ఆమెను కలవటానికి వచ్చిన వాళ్లలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కరోనా టెస్ట్ చేస్తే, ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీనితో ఆయనకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కవితను కలిసిన వాళ్లలో సంజయ్ కుమార్ ఒకరు.. కవితకు దగ్గర మెలిగిన వ్యక్తి ఆయన. దీనితో కవిత నిన్ననే హోమ్ ఐసోలేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. రాబోవు ఐదు రోజులు కవిత ఐసోలేషన్ కే పరిమితం కావాలని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ముందు జాగ్రత్తగా మాత్రమే ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలుస్తుంది.

  ఇక సంజయ్ కుమార్ తో తిగిన వాళ్ళందరూ కచ్చితంగా కరోనా టెస్ట్ లు చేపించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో మొన్న కవితకు శుభాకాంక్షలు తెలపటానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అసలే సీఎం కూతురు కావటంతో అక్కడ చేసిన రచ్చ అంత ఇంత కాదు.. ప్రస్తుత పరిస్థితులు తెలిసి కూడా ఈ విధంగా చేయటం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఏదైనా శుభకార్యం చేయాలంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్న అధికారులు, కవిత విషయంలోకి వచ్చేసరికి సైలెంట్ అయ్యిపోయారు. ఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నారు .