తెలంగాణాలో త్వరలో ఎన్నికల సమరభేరీ మోగనుంది.. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణాలో అధికార విపక్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, బీహార్ ఎన్నికలతో పాటు జరగనున్నట్టు ప్రకటించింది. కాగా ఏప్రిల్ 7వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మూడో వారం నుంచి లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో ఎన్నికల సంఘం కూడా ఈ ఉప ఎన్నిక ప్రక్రియ వాయిదా వేసింది.
ఇకపోతే ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున భూపతి రెడ్డి 2016లో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ గోడ దూకాడు. దాంతో ఆయనపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ముందే ఖరారు చేశారు. అందులో టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణలు పోటీలో నిలుచుంటున్నారు.. కాగా ఈ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న అందరు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు.
ఇక హోరాహోరిగా జరగనున్న ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తెలంగాణ ముఖ్యమంత్రి, కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవితకు విజయం ఖాయమని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. అయితే గతంలోని 2014లో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. అయితే, గత లోకసభ ఎన్నికల్లో ఆమె, బీజేపీ తరఫున పోటీ చేసిన అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి ఈ ఎన్నికల్లో కవిత ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.. అందులో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ కు చెందినవారే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అందువల్ల కవిత విజయం ఖాయమనే నమ్మకం అందరిలో కలుగుతుందట.. ఇక పార్టీ నుండి కవితకు ఫుల్ సపోర్ట్ ఉండనే ఉంది. అందులో తన కూతురి గెలుపు కోసం సీయం కేసీయర్ కూడా ఎదురుచూస్తుండటంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైన ఈ ఎన్నికల్లో ఓటమి చవిచుస్తే కవిత రాజకీయ భవిష్యత్తు మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఎన్నికలు కల్వకుంట్ల కవిత కి లైఫ్ లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని అనుకుంటున్నారట ప్రజలు..