దమ్ముంటే జగన్ కి చెప్పుకోండి…రోజా హెచ్చరిక

MLA Roja Telugu rajyam

  వైసీపీ పార్టీ లో జగన్ తర్వాత ఫాలోయింగ్ కలిగిన నేతల్లో నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ముందు వరుసలో వుంటారు, ప్రతిపక్షములో ఉన్న, అధికార పక్షంలో వున్నా కానీ, అవతలి పార్టీలను విమర్శించటానికి ఎన్నడూ వెనకాడని స్వభావం ఆమె సొంతం. జగన్ కి బాగా నమ్మిన బంటుగా ఉండే రోజాకు ఈ మధ్య కాలంలో సొంత పార్టీలోనే చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతున్నాయి.

Roja telugu rajyam

  తాజాగా వాటిపై రోజా తనదైన శైలిలో సమాధానం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. నా నియోజకవర్గంలోకి ఎవరైనా రావాలంటే కచ్చితంగా నా అనుమతి తీసుకోవాలని మరోసారి కుండబద్దలు కొట్టింది. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ లో నన్ను తన చెల్లెలు అంటూ సంభోదించారని, ఆ మాట కోసమైనా ఆయనకు రుణపడి వున్నానని, పదేళ్ల నుండి జగన్ తో నడుస్తున్న కాబట్టి ఆయనతో వున్నా వాళ్ళకి మంత్రి పదవి వస్తుందని అనుకోవటం సహజమే, అయితే ఒకే జిల్లా నుండి, ఒకే సామజిక వర్గానికి రెండు మంత్రి పదవులు రావటం కష్టం, సీనియర్స్ ను కాదని నాకు మంత్రి పదవి ఇవ్వటం కరెక్ట్ కాదు. అందుకే మంత్రి పదవి రాలేదు తప్పితే, పనికట్టుకొని ఎవరు నాకు వ్యతిరేకంగా పనిచేయటం లేదని చెప్పుకొచ్చింది. నగరిలో అడుగు పెట్టాలంటే కచ్చితంగా రోజా పర్మిషన్ తీసుకోవాలా అని యాంకర్ అడగటంతో రోజా కూడా అంతే ముక్కుసూటిగా అవును…నగరిలో అడుగు పెట్టాలంటే నా అనుమతి తీసుకోవాలని చెప్పటం విశేషం..

  తాను ఇతర నియోజకవర్గాల్లో అడుగుపెట్టనని, అలాగే తన నియోజకవర్గంలో ఎవరైనా అడుగుపెట్టాలంటే తన అనుమతి తీసుకోవాలని, గతంలో సీఎం జగన్ గారికి ఇదే విషయంపై నేను చెప్పానని, ఆ సమయంలో అయన కూడా మిగిలిన నేతలకు దీనిపై క్లారిటీ ఇచ్చాడని రోజా చెప్పుకొచ్చింది. ఏ నియోజకవర్గమైన సరే అక్కడికి వెళ్లి ఏమైనా కార్యక్రమం చేయాలంటే అక్కడి ప్రజాపతినిధికి చెప్పే వెళ్లాలని అనేక సభలో జగన్ చెప్పటం జరిగిందని, ఏకంగా సీఎం జగన్ వచ్చేటప్పుడే ఆయా నియోజకవర్గాల్లో ముందుగా చెప్పి వస్తాడని, ఇక మిగిలిన నేతలు కూడా ఆయన్ని ఫాలో కావలసిందే అంటూ రోజు గట్టిగానే చెప్పింది. గతంలో డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి రోజాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నగరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దీనిపై రోజా అప్పట్లో సీరియస్ అయ్యింది. తాను డిప్యూటీ సీఎంగా ఎక్క‌డైనా తిర‌గొచ్చని, రోజా ద‌గ్గ‌ర ప‌ర్మీష‌న్ తీసుకోన‌వ‌స‌రం లేద‌ని నారాయ‌ణ‌స్వామి అప్పట్లో చెప్పటం జరిగింది. దీనిపై కూడా రోజా స్పందిస్తూ… ఆ మాట జ‌గ‌న్‌కు చెప్పే ధైర్యం ఆయ‌న‌కు ఉండాలి . నారాయణ స్వామికి ఈ విషయం తెలియక చేసారని నేను అనుకుంటున్నా అంటూ రోజా తాజగా వెల్లడించింది.