ఎంత మాట అనేశారు మంత్రిగారూ.? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది మంత్రి రోజా ట్వీటు గురించి. నగిరి నియోజకవర్గంలో 11 లక్షల ప్రజా ధనంతో ఏర్పాటు చేసిన మంచి నీటి కుళాయిల వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఆ కులాయిల వ్యవహారానికి హంద్రీనీవాతో లింకు పెట్టడమే ఇందుక్కారణం.
రోజా తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంపై ట్వీటేస్తే, నాగబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. దానికి రిటార్ట్ ఇస్తూ, గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అనేశారు.! గాడిద ఎవరు.? సొంత సొమ్ములతో బెంజి కార్లు కొంటూ.. ప్రజాధనాన్ని కేవలం 11 లక్షలే వెచ్చించి.. కుళాయిలు ఏర్పాటు చేసినోలా.? స్వార్జితాన్ని కోట్లలో దానం చేసినవాళ్ళాం.? అంటూ రోజాపై మండిపడుతున్నారు.
పైగా, ఐదు దశాబ్దాలుగా సదరు ఊరి ప్రజలు మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని రోజా చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే, ఆ 50 ఏళ్ళలో తొమ్మిదేళ్ళపాటు రోజా, అదే నియోజకవర్గానికి ప్రజా ప్రతినిథిగా వున్నారు మరి.!
11 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేసి గాడిద.. గందపు చెక్కల వాసన.. అంటూ రోజా పెద్ద మాటలు మాట్లాడటాన్ని తప్పు పడుతున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో రోజాని సమర్థించేవారే కరవయ్యారు. మంత్రి హోదాలో వుండి, జస్ట్ 11 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి కుళాయిలు ప్రారంభించి పల్లిసిటీ చేసుకోవడమేంటన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.