ఆర్‌కే రోజా.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరు. వైసీపీ లో సీఎం వైఎస్ జగన్ తర్వాత ప్రతిపక్షాల పై అంతటి స్థాయిలో విరుచుకుపడేది రోజా మాత్రమే. ఇదిలా ఉంటే ఈ రోజు ఏపీ సీఎం వై ఎస్ జగన్ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయిన పి. పుష్పకుమారి అనే చిన్నారిని ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ పుట్టిన రోజునాడు దత్తత తీసుకున్నారు.
ప్రస్తుతం ఆ బాలిక తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటోంది. పుష్ప కుమారికి మెడిసిన్ చేయాలనే లక్ష్యం ఉందని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్ చదవాలని ఎమ్మెల్యే రోజాతో తెలిపిన విద్యార్థిని పుష్పకుమారి. పుష్ప కుమారి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తు చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుష్పను దత్తత తీసుకుంటున్నాని మాటిచ్చారు.
మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకున్నాను. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న అని తెలిపారు.
మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..!
మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు @ysjagan అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది.
పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.#HBDYSJagan#HBDBestCMYSJagan pic.twitter.com/dQUu8rWZer
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2020