Fish Venkat: ఫిష్ వెంకట్ చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.. భరోసా ఇచ్చిన మంత్రి!

Fish Venkat: తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించింది. గత కొంతకాలంగా ఈయన రెండు కిడ్నీలో పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిన నేపథ్యంలో వెంటనే ఈయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఫిష్ వెంకట్ ను బోడుప్పల్ RBM హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈయనకు ఆర్థిక సహాయం చేయాలి అంటూ తన భార్య కుమార్తె సినిమా ఇండస్ట్రీని అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నారు అయితే ఇప్పటివరకు సరైన సహాయం మాత్రం అందలేదని చెప్పాలి అయితే ఓ వ్యక్తి ప్రభాస్ పిఏ అంటూ ఫేక్ ఫోన్ కాల్ చేసి 50 లక్షలు ఇస్తామంటూ ప్రచారం చేశారు అయితే ఇందులో నిజం లేదని తేలింది.

ఇకపోతే తాజాగా తెలంగాణకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను కలిశారు అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి కాస్త మెరుగుపడిందని తెలుస్తుంది. ఇలా ఫిష్ వెంకట్ ను పరామర్శించిన మంత్రి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా తన వంతు ఆ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా తన చికిత్స పూర్తి అయ్యేవరకు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది అంటూ ఆయన అభయం ఇచ్చారు. ఇలా తెలంగాణ మంత్రి స్పందించి ఫిష్ వెంకట్ కు భరోసా కల్పించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.