Megastar Chiranjeevi: సతీ సమేతంగా సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న మెగాస్టార్!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఇద్దరూ కలిసి ముచ్చింతలో లోని మహా సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించడంతో ఆశ్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు దర్శించారు.ఈ సందర్భంగా ఆశ్రమానికి వెళ్ళిన మెగాస్టార్ దంపతులకు చిన్న జీయర్ స్వామి ఆశీర్వచనాలు పలికి మెగాస్టార్ దంపతులకు సమతా మూర్తి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆశ్రమంలో ఉన్న 108 దేవత మూర్తులను మెగాస్టార్ దంపతులు దర్శించుకున్నారు.

ఇకపోతే ఈ ఆశ్రమంలో కాసేపు గడిపిన మెగాస్టార్ చిరంజీవి చిన్న జీయర్, సమత మూర్తి గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ విధంగా సమతా మూర్తిని దర్శించుకున్న మెగాస్టార్ దంపతులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఇప్పటికే సమత మూర్తి విగ్రహాన్ని దర్శించడం కోసం టాలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సునీత దంపతులు సమత మూర్తి విగ్రహాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. ఇక రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆశ్రమాన్ని సందర్శించి 120 కిలోల బంగారపు సమతా మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన హైదరాబాద్ చేరుకొనున్నట్లు తెలుస్తోంది.