సీఎం వైఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి

తెలుగు సినిమా ఇండస్ట్రీ పై వరాల జల్లు కురిపించింన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై తన సంతోషాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విటర్‌లో ‘ఎగ్జిబిటర్స్‌ కోసం సినిమా రిసార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్దరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి.

ys jagan not hapy with those ministers work
 

సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

కాగా కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊరటనిచ్చింది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది.

నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది.మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది.