సుమ ఏంటి ఇలా మారిపోయింది.. డబ్బు కోసం మరి ఇంతలా చేయాలా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుమ సమకాలా. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకుల మనసు దోచుకొని మంచి గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తున్న సుమ బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో యాంకరింగ్ చేయటమే కాకుండా స్టార్ హీరోలు నటించిన సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ నిత్యం బిజీగా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇలా సుమ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అందరి అభిమాన యాంకర్ గా గుర్తింపు పొందింది.

అయితే అప్పుడప్పుడు సుమ యాంకరింగ్ గురించి విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో స్టార్ హీరోల గురించి నోరు జారి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సుమ యాంకరింగ్ ప్రేక్షకులకు కొంచెం బోరింగ్ గా అనిపిస్తోంది. దీంతో సుమ ప్రేక్షకులను ఆకట్టుకోవటం కోసం కొంచెం తన యాంకరింగ్ విషయంలో హద్దులు మీరుతున్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సుమ యాంకర్ గా “సుమా అడ్డా” అనే సరికొత్త షో ప్రారంభమైంది. క్యాష్ షో తరహాలోనే ఈ షో లో కూడా సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇక ఈ షోలో సుమ గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతో వ్యవహరించే తీరు కొంచెం ఓవర్ గా అనిపిస్తోంది.

ఇక ఇటీవల ఈ షోలో చిరంజీవి గారు అతిధిగా పాల్గొన్నప్పుడు సుమ చేసిన సందడి మరీ ఓవర్ గా అనిపించింది. అంతే కాకుండా జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గెస్ట్లుగా వచ్చిన ఎపిసోడ్ లో కూడా సుమ యాంకరింగ్ ఇలాగే ఉంది. దీంతో సుమ యాంకరింగ్ విషయంలో రాజీవ్ కనకాల కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తన పాపులారిటీ తగ్గకుండా ఆన్సర్ గా కొనసాగటంతో పాటు రెమ్యూనరేషన్ కోసం సుమ హద్దులు మీరు ప్రవర్తిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై సుమ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.