వైరల్..ఆ వేదికపై ఏపీ సీఎం పై మెగాస్టార్ ఫైర్..!

టాలీవుడ్ పెద్ద గా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు నుంచో చెలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ఏ సమస్య వచ్చినా కూడా మొదటగా ఇండస్ట్రీ ని చిరు నే స్పందించి ముందుకు వస్తారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరోనా టైం లో చిరు చాలా సాయం అందించారు.

ఒక్క సినీ కార్మికులకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సొంత ఖర్చులతో కూడా ఆక్సిజన్ సరఫరా చేశారు. కానీ ఇప్పుడు చిరు కి ఓ రకంగా అవమానమే ఎదురైనట్టు అని చెప్పాలి. ఇటీవల జరిగిన సంతోషం అవార్డు వేడుకల్లో చిరు షాకింగ్ కామెంట్స్ చేశారట.

టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం కి తాను లెటర్ పెట్టి మీటింగ్ రిక్వెస్ట్ పెట్టగా అసలు వారి నుంచి ఎలాంటి స్పందన తిరిగి రాలేదు అని సినిమా పరిశ్రమ ఇబ్బందులు పడుతున్నా వారు ఇలా వ్యవహరించడం బాగాలేదని చిరు ఫైర్ అయ్యారట. ఈ వీడియో కూడా త్వరలో బయటకి వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు అయితే ఈ మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి.