2009 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పుట్టింది ప్రజారాజ్యం పార్టీ. అధికార పీఠమెక్కాలనుకున్న చిరంజీవి, అంచనాల్ని అందుకోలేకపోయారుగానీ, అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అప్పట్లో చిరంజీవి పార్టీ తమను దెబ్బకొట్టిందని అటు చంద్రబాబు, ఇటు వైఎస్సార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోపక్క, వైఎస్సార్ కుట్రల కారణంగానే చిరంజీవి కుటుంబంలో తీవ్ర అలజడి నెలకొందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ కారణంగానే పార్టీ పెట్టాలన్న కసి చిరంజీవిలో మరింత పెరిగిందని అంటారు. అది గతం. ప్రస్తుతానికి వస్తే, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారు. అయితే, అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాల్ని కలిగి వున్నారు.
తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున, సోషల్ మీడియా వేదికగా స్పందించిన చిరంజీవి, ‘ప్రియతమ ప్రజా నాయకుడు’ అంటూ ట్వేటీయడం పట్ల సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా చిరంజీవి పార్టీ పెట్టారనీ, ఇప్పుడు అదే రాజశేఖర్ రెడ్డిని ప్రజా నాయకుడిగా చిరంజీవి కొనియాడుతున్నారనీ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ట్రోekaలింగ్ చేస్తున్నారు చిరంజీవి మీద. స్టూడియో వ్యవహారాల కోసమే చిరంజీవి ఈ ట్వీట్ వేశారన్నది మరో వాదన. వైఎస్ జగన్ మెప్పు కోసం చిరంజీవి ఇళాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లను పోటెత్తించేస్తున్నారు. అయితే, రాజకీయాలకతీతంగా ఆయా ప్రముఖుల విషయంలో చిరంజీవి తరచూ ట్వీట్లు వేస్తున్నారు. ఆ కోణంలోనే ఈ ట్వీటుని కూడా చూడాలేమో.