Medical College Raging:జనవరి 1వ తేదీ సూర్యాపేటలోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అవుతూ ఈ కేసుపై విచారణ జరపాలని ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేశారంటూ పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసుపై సమగ్ర విచారణ జరగడం కోసం నలుగురు హెచ్ఓడీ లను ప్రత్యేక విచారణ కమిటీ అధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలోనే ప్రత్యేక విచారణ కమిటీ అధికారులు నేడు వారి నివేదికను సమర్పించారు.ఈ నివేదికలో భాగంగా జనవరి 1వ తేదీ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయలేదని బయటపెట్టడంతో కొన్ని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వీరీ మధ్య ఘర్షణ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేయడంతో సదరు విద్యార్థి తీవ్ర అయోమయంలో ఉన్నారు.
ఇక ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేయడంతో సీనియర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఒక ఏడాది పాటు తమ పిల్లలను సస్పెండ్ చేస్తే వారి భవిష్యత్తు ఏం కావాలని అడిగారు. సస్పెన్షన్ టెన్షన్ ఇలా ఉంటే పోలీసుల కేసు ఎక్కడికి దారి తీస్తుందోనని తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు. మరి ఈ ర్యాగింగ్ కేసు ఎటువైపు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.