సూర్యాపేట జిల్లాలో దారుణం.. తన చెల్లిని ప్రేమించాడని యువకుడుని చంపిన అన్న!

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చిన్నవయసులోనే చదువుకోకుండా ప్రేమ అంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు ఖర్చు చేసి వారిని చదివిస్తుంటే కొందరు యువతీ యువకులు మాత్రం ప్రేమ పేరుతో చదువును పక్కన పెట్టీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లల ప్రేమ వ్యవహారాలు తెలిసి కోపంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎంతోమంది హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణమైన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చెల్లిని ప్రేమించినందుకు యువకుడిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేటలో కలకలం రేపుతోంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం… సూర్యాపేట జిల్లా మినీ ట్యాంకుబండ వద్ద యువకుడి మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతి చెందిన యువకుడు చందనబోయిన దిలీప్ గా గుర్తించారు. ఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులు యువకుడు హత్య చేయబడ్డాడని పోలీసులు గుర్తించారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సూర్యాపేట జిల్లా తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన దిలీప్ అనే 19 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో ఈ ప్రేమ విషయం తెలుసుకున్న యువతి సోదరుడు వారి ప్రేమను అంగీకరించలేదు. ఈ క్రమంలో దిలీప్ తో మాట్లాడాలని సదరు యువతి సోదరుడు అతనిని సద్దల చెరువు వద్దకు పిలిచాడు.

దిలీప్ సద్దల చెరువు వద్దకు వెళ్లిన తర్వాత యువతి సోదురుడు విచక్షణా రహితంగా దిలీప్ మీద దాడి చేశాడు. అనంతరం దిలీప్ ని బీరు సీసాలతో పదే పదే పొడిచాడు. దీంతో దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.