Sad: ప్రస్తుత సమాజంలో యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుకున్న విద్యార్థులు సైతం ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు చదువుకొని, తల్లిదండ్రులతో పాటు ఆనందంగా ఉండాల్సిన యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే వారికి నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. అయితే చేతికందిన పిల్లలు ఇలా జీవచ్ఛవంలా పడి ఉండటంతో ఆ పిల్ల కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లల పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నా తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
సమాజంలో రోజుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా యువతలో మార్పు రావడం లేదు. ఎక్కువగా చదువుకున్న వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన ఒకటి ఒడిశాలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ సెకండియర్ చదువుతున్న ఈ యువతి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ భువనేశ్వర్ లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ సెకండియర్ చదువుతున్న ఒక యువతి తన హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. చనిపోయిన ఆ యువతికి ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక జనవరి 3వ తేదీ ఉద్యోగంలో చేరాల్సి ఉండగా ఇలా ఊహించని విధంగా ఆ యువతి గదిలో వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో బాధితురాలి తల్లిదండ్రులు గుండెలవిసేలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే క్యాంపస్ ఇంటర్వ్యూ లో జాబ్ వచ్చిన తరువాత తమ కూతురికి ఉద్యోగం వచ్చిందని, జనవరి 3వ తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది అని తన కూతురు ఎంతో సంతోషంతో ఫోన్ చేసి మరీ చెప్పింది అని, కానీ ఇంతలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక అర్థం ఏమిటి అన్నది అర్థం కావడం లేదు అంటూ యువతి తండ్రి సుధాకర్ సేతి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన యువతిని శుశ్రీ ప్రగ్యామిత సేతి గా పోలీసులు గుర్తించారు. కోరాపుట్ లో ఆమె కుటుంబం నివసిస్తోంది అని పోలీసులు తెలిపారు. చదువు కోసం ఆమె భువనేశ్వర్ లోని కాలేజీ హాస్టల్ లో ఉంటోందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.