హైద్రాబాద్ గ్యాంగ్ రేప్: టీఆర్ఎస్ పరువు పోయినట్టే.!

తెలంగాణ రాష్ట్ర సమితి గడచిన ఎనిమిదేళ్ళలో అధికార పార్టీగా సంపాదించుకున్న ఇమేజ్ ఒక్క దెబ్బకి గల్లంతైపోయింది. హైద్రాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనతో, తెలంగాణ రాష్ట్ర సమితికి మకిలి పట్టినట్లయ్యింది. మరిప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ముందున్న అవకాశమేంటి.? ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటే, దానికి చాలా అడ్డంకులే వున్నట్లు కనిపిస్తోంది.

బయట నుంచి మద్దతిస్తోన్న మజ్లిస్ పార్టీకి చెందినవారి వారసలు, అధికార పార్టీకి చెందిన నేతల వారసులూ ఈ అఘాయిత్యం వెనుక వున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు కొందర్ని పోలీసులు అరెస్టు చేశారు కూడా. అయినాగానీ, తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్న ‘న్యాయం’ ఇది కాదు.! సజ్జనార్ సార్ ఎన్‌కౌంటర్ అందరికీ గుర్తుకొస్తోంది.

ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీస్ పరువు కూడా పోతోంది. అప్పట్లో ఎలా వుండేది.? ఇప్పుడు ఇలాగయ్యిందేంటి.? అంటూ, దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీస్ వ్యవహరించిన విధానాన్ని, ప్రస్తుత గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం పరిణామాల్ని పోల్చి చూస్తున్నారు.

వాస్తవానికి, తెలంగాణ సర్కారు ఇలాంటి ఘటనల్ని అస్సలు ఉపేక్షించదు. దిశ ఘటనతోనే అది నిరూపితమయ్యింది. కానీ, ఎందుకో ఈసారి.. స్పందించాల్సినంత వేగంగా, నిజాయితీగా హైద్రాబాద్ గ్యాంగ్ రేప్ ఘటన విషయమై తెలంగాణ సర్కారు స్పందించడంలేదు.
వచ్చే ఎన్నికల్లో ఈ అంశం అధికార పార్టీని నిండా ముంచేసే అవకాశాలు లేకపోలేదు.