పూరి బీచ్ లో విషాదం.. కొడుకు ముందే కొట్టుకుపోయిన తండ్రి..

బాలేశ్వర కు చెందిన బన్సీధర్ బెహర తన కుటుంబ సభ్యులతో కలిసి పూరి బీచ్ కి వెళ్ళాడు. ఇక 12 ఏళ్ల కుమారుడు తో కలిసి సముద్రపు అలలలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇక ఈ దృశ్యాన్ని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు వీడియోని కూడా తీయగా.. అంతలోనే ఒక పెద్ద అల అతడిని తీసుకెళ్ళింది.

కుటుంబ సభ్యులు అతడి కోసం ఎంత వెతికినా కూడా దొరకలేదు. ఇక మృతదేహం కోసం సిబ్బందులు గాలింపు చేస్తున్నారు. కొడుకు, కుటుంబ సభ్యుల ముందే ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్రమైన విషాదం నెలకొల్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. అందులో ఆయన చివరి ప్రయాణం క్లియర్ గా కనిపించింది.