Crime News: స్వచ్చంధ సంస్థల పేరుతో ఘరానా మోసం.. కోట్లు కొట్టేసిన వైనం..!

Crime News: ప్రస్తుత కాలంలో చిట్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వడ్డీ వ్యాపారాల పేరిట చాలామంది కేటుగాళ్లు ప్రజలను మభ్యపెట్టి కోట్లు కొల్లగొడుతున్నాడు. మోసపోయే వారి నప్పుడు కోకొల్లలుగా మోసం చేసేవారు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా కూడా కొందరు మాత్రం అలాంటి వారిని నమ్మి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కేటుగాళ్లు చేతుల్లో పెడుతున్నారు. అచ్చం ఇలాంటి సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..జిల్లాలోని మధిర చెరుకుమల్లి వారి వీధిలో రాధా కృష్ణ అనే వ్యక్తి ఇస్కాన్ అనే పేరిట స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాడు. ఇస్కాన్ పేరుతో సంస్థ ఉండటంతో ప్రజలు నమ్మి మోసపోయారు.స్వచ్ఛంద సంస్థ పేరుతో 65 వేలకే స్కూటీ ఇస్తానని సుమారు కోటి యాబై లక్షల రూపాయల వరకు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ ఇస్కాన్ సంస్థ ద్వారా 65 వేల రూపాయలకే స్కూటీ ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్ పెట్టాడు. అతి తక్కువ ధరకే స్కూటీ ఇస్తామని చెప్పడంతో పైగా సంస్థ పేరు మీద ఉన్న నమ్మకం తో మొదట్లోనే కొంతమంది డబ్బు కట్టారు.అయితే ప్రజలలో నమ్మకం పెంచుకోవటానికి డబ్బులు కట్టిన వారికి పది రోజుల్లోనే స్కూటీ లు అందజేశాడు.

దీంతో ఇలా తక్కువ ధరకే స్కూటీ పొందినవారు వారి బంధువులతోనూ ,ఇరుగుపొరుగు వారితో చెప్పి డబ్బు కట్టించారు. ఇలా స్కూటీ మాత్రమే కాకుండా మిక్సీలు,గ్రైండర్, లాప్ టాప్, కుట్టు మిషన్ లు కూడా తక్కువ ధరకి ఇస్తామని వందల మంది దగ్గర కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశాడు. ముందు జాగ్రత్త వల్ల డబ్బులు తీసుకునే క్రమంలో ఫోన్ పే, గూగుల్ పే వంటివి వద్దని లిక్విడ్ క్యాష్ చెల్లించాలని చెప్పాడు. ఈ క్రమంలో కోటి యాభై లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేశాడు. కేవలం తెలంగాణ నుండి కాకుండా ఆంధ్ర నుండి కూడా చాలా మంది డబ్బులు కట్టారు.

కొంత కాలం తర్వాత రాధ కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటంతో ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. రాధ కృష్ణ కనిపించకుండా పోవటంతో అందరికీ అనుమానం వచ్చి వారు మోసపోయామని భావించి పోలీసులను ఆశ్రయించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.