Tooth Paste: బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీ దంతలకే ప్రమాదం!

ఈ ఆధునిక కాలంలో చాలామందిని కలవరపెడుతున్న సమస్య దంతాల సమస్యలు. పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ ఉదయం లేవగానే బ్రష్ చేయడం పరిపాటి. నోటి శుభ్రత, నోటిలో ఉన్న బ్యాక్టీరియాను బ్రష్ చేయడం ద్వారా తొలగించవచ్చు. రోజు ఉదయం లేచిన తర్వాత అలాగే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. దంతాలను శుభ్రపరిచే ప్రధానం సరిగ్గా లేకుంటే చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. పెద్దలు, పిల్లలు బ్రష్ చేసేటప్పుడు చేసే తప్పులను చూద్దాం.

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో సరిగా బ్రష్ చేసే సమయం కూడ లేక బ్రష్ చేసేటప్పుడు చాలామంది చాలా స్పీడ్ గా చేస్తుంటారు. దీనివల్ల దంతాలు, చిగుళ్ళు కుదుపు జరిగి నొప్పి మొదలవుతుంది. ఇది సరైన విధానం కాదు. దీనివల్ల దంతాలలో ఉన్న మురికి బయటికి రాకపోవడమే కాక దంతాలకు మరియు చిగుల్లకి నష్టం కలిగిస్తుంది.

దంతాలను లోపలి భాగం లో సమాంతరంగా బ్రష్ చేయాలి. బ్రష్ చేసేటపుడు దంతాల మీద బాగా గట్టిగ అదిమి బ్రష్ చేయకూడదు. బ్రష్ చేసేటపుడు అడ్డంగా బ్రష్ చేయకూడదు. పైకి కిందకీ నిలువుగా కానీ వృత్తాకారంలో కానీ బ్రష్ చేయడం మంచిది. 90 % బ్రషింగ్ చేసేటపుడు ఈ సూచనలను పాటించడం మంచిది.

ప్రతిరోజు ఉదయం డ్రెస్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించడం వలన నోట్లోని క్రిములు చనిపోయి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చాలి. టూత్ బ్రష్ లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి..అవి కాల క్రమేణా నోటిలోకి రావడం ప్రారంభిస్తాయి. బ్రష్ చేసేటపుడు నాలుకని కూడా శుభ్రపరచుకొండి. బ్రష్ చేసేటపుడు కనీసం 2 నిమిషాల కన్న ఎక్కువ సేపు బ్రష్ చేయాలి.