Mahesh Babu : షాకింగ్ ట్విస్ట్ : తన సినిమాకి తానే అడ్డు పడుతున్న మహేష్??కథ ఏమిటంటే.!

Mahesh Babu : తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి ఆల్ టైం మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో మన టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒకరు. అయితే మహేష్ బాబు ఇపుడు తన నుంచి ఒక్కో ప్రాజెక్ట్ మార్కెట్ ని భారీ లెవెల్లో పెంచుకుంటు పాన్ ఇండియా సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. మహేష్ నుంచి ఎప్పుడో దీనిని ఆశించినా ఇపుడు దీనికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఈ పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్లే ముందు మహేష్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సినిమా ఇప్పుడు చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ఒక్క పాట మినహా పూర్తి అయ్యిపోయినట్టు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు.
కానీ మహేష్ ఈ సినిమా కి ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ ని ఎలా అయినా కూడా అనుకున్న తేదీ మే 12కి రిలీజ్ చేసేయాలని చిత్ర నిర్మాతలు మరియు దర్శకుడు అనుకుంటున్నారట. కానీ మహేష్ మాత్రం అందుకు నో చెబుతున్నాడని తెలుస్తుంది.
ఇది ఎందుకంటే సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వవద్దని కాస్త లేట్ అయినా పర్వాలేదు మళ్ళీ మొత్తం అంతా కరెక్ట్ గా చూసుకొని ఎక్కడైనా దిద్దుబాట్లు ఉంటే వాటిని సెట్ చేసి రిలీజ్ చేద్దాం అని తన అభిప్రాయాన్ని వారికి చెప్పాడట.
దీనితో మేకర్స్ కాస్త సందిగ్ధంలో పడ్డారని తెలుస్తుంది. మరి దీనితో రిలీజ్ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.