సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతోంది. ప్రత్యేకంగా సెట్ వేసి రాజమౌళి షూటింగ్ జరుపుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కోసం యాక్షన్ సీన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు నుంచి కెనడాలోనూ షూటింగ్ ప్లాన్ చేసారట. అయితే, ఈ సినిమా విషయంలో రాజమౌళి తీసుకున్న ఓ నిర్ణయం అందరిని షాక్‌కి గురి చేసింది.
టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. ఈ సినిమాలో పనిచేయడం లేదని తెలిసింది. ఎందుకంటే రాజమౌళి ఈసారి కొత్త టెక్నీషియన్లతో మాత్రమే పని చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకే తన టీమ్‌లో పాతవాళ్లను మార్చేసి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నారని టాక్. ఈ విషయం గురించి సెంథిల్ కుమార్ కూడా వెల్లడించినట్లు ఫిలింనగర్‌లో చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్రలో నటిస్తోందన్నది మరో హాట్ టాపిక్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రాజమౌళి తీసుకున్న ఈ కొత్త నిర్ణయం సినిమాకు కొత్త ఫీల్ ఇస్తుందో లేదో చూడాలి.
