YS Jagan: వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన జగన్ మోహన్ రెడ్డితో పాటు సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎంతో అద్భుతమైన పాలన అందించినప్పటికీ ప్రజలకు నచ్చలేదని తెలిపారు. అదే సినిమాటిక్ గా చేసి చూపిస్తే మాత్రం సక్సెస్ చేస్తారని తెలిపారు.
మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఏ విధంగా అయితే చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేశారు. లంచాల గురించి కానీ విద్య గురించి గానీ వైద్యం గురించి గానీ ఆ సినిమాలో చూపించినట్టే జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు కానీ ప్రేక్షకులు మహేష్ బాబు సినిమాని సూపర్ హిట్ చేశారు కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఫట్ చేశారని తెలిపారు.
ఇక ఈ సినిమా చివరిలో నాయకుడు లేని సమాజం తీసుకురావాలి అంటే సరైన నాయకుడే ఉండాలి అని కొటేషన్ చూయిస్తారు అచ్చం అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన కూడా ప్రజలు తనకి ఓటమి కట్టబెట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఓటమి వచ్చిన తర్వాత ఆయనలో ఏదైనా మార్పు రావాలా అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేతిరెడ్డి సమాధానం చెబుతూ…వైఎస్ జగన్‌లో మార్పు రావాల్సిన అవసరం లేదు. జగన్ అలా ఉంటారనే ఆయనను ఫాలో అయ్యాం. ఆయన చెప్పిందే చేస్తాడు. చేసేది చెబుతాడు. జగన్.. జగన్ లానే ఉండాలి.
జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు అవసరం లేదు అలా మారుకుంటూ పోతుంటే ఆయన లీడర్ ఎలా అవుతారని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఇక సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం గురించి కూడా ఈయన మాట్లాడారు ప్రజల గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకున్నారు దీంతో కాస్త గ్యాప్ ఏర్పడింది అప్పట్లో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి విచ్చలవిడిగా మాట్లాడారు అయితే ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే జరుగుతుంది.
తెలంగాణలో కూడా సినిమా టికెట్ల రేట్లు అన్నిటిని కూడా పూర్తిగా తగ్గించేసారు కానీ ఇప్పుడు ఏ ఒక్క హీరో కూడా మాట్లాడలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు ఇప్పుడు అక్కడ హీరోలను మాట్లాడమనండి చూద్దాం మాట్లాడరు. ఎందుకంటే వారికి హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడరు అంటూ హీరోల గురించి కూడా ఈయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.