Crime News: ప్రస్తుత కాలంలో కని పెంచిన తల్లిదండ్రులు వారి పిల్లలకు భారం అవుతున్నారు. పిల్లల ఆసరా లేక ఎంతో మంది వృద్ధులు అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలలో కాలం గడుపుతున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఏ విధమైన కష్టం వచ్చినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రెండేళ్లుగా వృద్ధురాలు ఉంటున్న ఇంటి నుండి దుర్వాసన వస్తున్న ఏం జరిగిందో అని ఎవరు కూడా పట్టించుకోలేదు.
వివరాలలోకి వెళితే..లండన్‌లోని పెచ్‌కమ్‌లోని సెయింట్ మేరీస్ రోడ్‌లో ఓ మూడంతస్థుల భవనంలో వృద్ద మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూతపడే ఉంది.ఇంటి తలుపుకి సైకిల్ అడ్డుగా ఉండటంతో ఆమె ఇంట్లో లేదని అందరూ భావించారు.ఐతే కొంత కాలం తరువాత ఆ ఇంటినుండి దుర్వాసన రావడం మొదలైంది. అక్కడ నివాసం ఉంటున్న వారు ఈ విషయాన్ని హౌజింగ్ అసోషియేషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారందరూ ముక్కు మూసుకుని అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు.
రెండు సంవత్సరాల నుండి ఇలా దుర్వాసన రావటంతో ఇంటి చుట్టూ వాసన రాకుండా స్థానికులు బట్టలు అడ్డుపెట్టారు. ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. గత రెండు సంవత్సరాలుగా ఆ వాసన వర్ణిస్తూ ఉన్న ఒక యువతి వాసన భరించడం తన వల్ల కాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 18వ తేదీన పోలీసులు ఆమె ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కుర్చీలో ఆ పెద్దావిడ శరీరం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు? ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం లండన్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.