దుమ్ము లేపిన “లైగర్” ట్రైలర్..24 గంటల్లో అన్ని భాషల వ్యూస్ ఎంతో తెలుసా..!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఆడియెన్స్ ఆసక్తి తగ్గించిందని చెప్పాలి. దీనికి కారణం చాలానే ఉండి ఉండొచ్చు కానీ రాబోయే కొన్ని రోజుల్లో మాత్రం ఈ సినిమాలు పక్కాగా భారీ రెస్పాన్స్ కొల్లగొడతాయి అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న చిత్రాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో ఒకటే “లైగర్”.

మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుకొని రెడీగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే మాసివ్ ట్రైలర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చెయ్యగా ఈ ట్రైలర్ కి 24 గంటల్లో దుమ్ము లేచే రెస్పాన్స్ వచ్చింది.

మెయిన్ గా మన తెలుగు మరియు హిందీ భాషల్లో రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే ఈ సినిమా ట్రైలర్ కి వచ్చింది. మరి ఈ ట్రైలర్ కి 24 గంటల్లో 50 మిలియన్ వ్యూస్ కి పైగా లెక్కలు నమోదు అయ్యాయి. దీనితో మేకర్స్ ఈ బిగ్గెస్ట్ రెస్పాన్స్ విజయ్ దేవరకొండ మాటలతో షేర్ చేసుకున్నారు.

మా కాంబో దెబ్బకి ఇండియా షేక్ అవుతుంది అని విజయ్ చెప్పిన మాటలతో మేకర్స్ అయితే తాము చెప్పిందే జరిగింది అని షేర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా ట్రైలర్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.