నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనిత్ రాయ్, ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, అబ్దుల్ ఖదీర్ అమిన్, విష్ణు రెడ్డి తదితరులు.
దర్శకత్వం : పూరి జగన్నాధ్
టాలీవుడ్ లో మొదట్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్న విజయ్ దేవరకొండ మొదటిసారి హీరోగా ‘పెళ్లి చూపులతో’ పెద్ద విజయం అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ గ్రాండ్ సక్సెస్ తో హీరోగా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ అక్కడి నుండి వరుసగా పలు సినిమాలు చేస్తూ మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే ‘గీత గోవిందం’ సినిమా తర్వాత ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ కొట్టలేదు విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా విజయ్ తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మూవీ ‘లైగర్’ సినిమాలో నటించాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భారీ స్థాయిలో నేడు ప్రేక్షకుల వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాలు, నార్త్, యుఎస్ఏ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే లైగర్ ప్రీ టికెట్ బుకింగ్స్ సూపర్ గా ఉండడంతో యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినా పూరి జగన్నాధ్ ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. మరో వైపు విజయ్ ఆటిట్యూడ్ వల్ల ఈ సినిమాకు కొంత నెగటివ్ పబ్లిసిటీ కూడా వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ:
బాలమణి (రమ్యకృష్ణ) కరీంనగర్ కి చెందిన ఒక మధ్యతరగతి మహిళ. ఆమె తన కొడుకు లైగర్ చాయ్ బండిపై ఊరూరు తిరుగుతూ చాయ్ అమ్ముకుంటూ ఉంటారు. అయితే బాలమణి కి తన కొడుకు (విజయ్ దేవరకొండ) ని ఎప్పటికైనా మార్షియల్ ఆర్ట్స్ లో నేషనల్ ఛాంపియన్ గా చూడాలని కళలు కంటుంది. ఇక్కడే ఉంటే అది జరగదని, తల్లి, కొడుకు తమ కల తీర్చుకోవడం కోసం ముంబై కి మకాం మారుస్తారు.
ఒక సాదా, సీదా కుర్రాడు ఎలా ఎం.ఎం.ఎ ఫైట్‌లో పాల్గొన్నాడు. మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎలా ఎగరవేశాడు? అనేది సినిమా స్టోరీ. బాలామణి (రమ్య కృష్ణ) లైగర్ తండ్రి గురించి సీక్రెట్ బయటపెట్టగా, అక్కడ కథలో అస్సలు ట్విస్ట్ మొదలవుతుంది. అలాగే ఈ సినిమాలో మైక్ టైసన్ , విజయ్ దేవరకొండకి ఉన్న సంబంధం ఏమిటి? విజయ్ తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ నటన
మైనస్ పాయింట్స్ :
స్క్నీన్ ప్లే
బోరింగ్ సీన్స్
నిదానంగా సాగే సన్నివేశాలు
ఈ సినిమా కోసం విజయ్ పడ్డ కష్టం తెలుస్తుంది. తన రోల్ కి వంద శాతం న్యాయం చేసాడు. అయితే రమ్య కృష్ణ ఓవర్ యాక్టింగ్ కొంచెం చిరాగ్గా ఉంటుంది. అనన్య పాండేకి నటనకు స్కోప్ లేదు. మిగతా నటీనటులు పరవాలేదనిపించారు.
ఈ సినిమా కు ముందు పూరి జగన్నాధ్, ఛార్మి, మూవీ టీం ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. విజయ్ దేవరకొండ నటన బాగున్నప్పటికీ పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు.
సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుందని కానీ లైగర్‌లో అలా లేదు. మైక్ టైసన్ పాత్ర అస్సలు ఆకట్టుకోలేదు.
తీర్పు :
చాలా భారీ అంచనాల మీద రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ ‘లైగర్’ పూర్తిగా నిరాశపరిచింది. విజయ్ హార్డ్ కోర్ ఫాన్స్ కి కొంత మేరకు ఈ సినిమా నచ్చుతుందేమో కానీ, మిగతా వాళ్ళకి ఈ సినిమా ఏ మాత్రం నచ్చదు. పూరి, విజయ్ ఖాతాలో మరో ప్లాప్.