Omicron Remedies: ఈ వంటింటి చిట్కాలు పాటించడంవల్ల ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..!

Omicron Remedies: ప్రస్తుతం ప్రపంచ దేశాల లో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశంలో రోజుకు దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వ్యాప్తి మిగిలిన వేరియంట్ లతో పోల్చితే అధికంగా ఉంది. కరోనా వల్ల ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించటం వల్ల ఒమిక్రాన్ గురించి భయపడాల్సిన పనిలేదు.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి వేల రూపాయలు ఖర్చుపెట్టి డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వంటింటి చిట్కాల ద్వారా ఒమిక్రాన్ దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. గొంతులో కఫం వల్ల ఇబ్బంది పడేవారు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి రోజుకు మూడు పూటలు పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు దూరమవుతాయి.

ఎటువంటి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. పసుపు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతులో ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు నల్ల మిరియాల పొడి కలుపుకొని తాగడం వల్ల గొంతులో ఉన్న శ్లేష్మం పూర్తిగా తగ్గిపోతుంది.

జలుబుతో బాధపడేవారు నీటిని బాగా మరిగించి ఆ నీటిలో రెండు ,మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పీల్చుకోవడం వల్ల జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి హెర్బల్ టీ తాగటాన్ని అలవాటు చేసుకుంటున్నారు.హెర్బల్ టీ తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు దరిచేరకుండా ఉంటాయి.