కుక్కలు, పందులకు లైసెన్స్ .. జగన్ సర్కార్ జీవో !

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆసక్తికరమైన ఉత్తర్వులను జారీ చేసింది. పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలంటూ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ ఆదేశాలను జారీ చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే, వాటికి సంబంధించిన యజమానికి రూ. 500 ఫైన్ విధించనున్నారు.

How to help stray dogs in your locality: Step-by-step guide - Information  News

అంతేకాదు, రోజుకు రూ. 250 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఒకవేళ అవి తమవంటూ ఎవరూ ముందుకు రాకపోతే… వాటిని వీధి కుక్కలు, పందులుగా గుర్తించి… వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారు. కుక్కలు, పందులకు లైసెన్స్ ముగిసిపోతే… తిరిగి 10 రోజుల్లోగా లైసెన్స్ ను రెనివల్ చేసుకోవాల్స్ ఉంటుంది.

యజమానులకు లైసెన్స్ అందించే సమయంలో వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ను అందించాలని ఆదేశించింది. ఈ జంతువులకు టోకెన్లను జారీ చేయాలని తెలిపింది.