2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారా? లేదా? అనే ప్రశ్నకు ప్రజల్లో భిన్నాభిప్రాయలు ఉన్నాయి. సగం మంది జగన్ మళ్లీ సీఎం అవుతారని చెబుతుండగా మిగతా సగం మంది మాత్రం జగన్ సీఎం అయ్యే అవకాశాలు దాదాపుగా లేవని చెబుతున్నారు. అయితే మూడు పనులు చేస్తే మాత్రం జగన్ మళ్లీ సీఎం అవుతారని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కార్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలంటే మొదట రాబోయే 14 నెలల్లో వీలైనంత అభివృద్ధి చేయాలి. కనీసం లక్ష ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా జగన్ నిరుద్యోగుల మనస్సులను గెలుచుకోవడంతో పాటు ప్రజల హృదయాల్లో మంచి స్థానం సొంతమయ్యే అవకాశం ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే దిశగా జగన్ అడుగులు వేయాలి. రాజధాని విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు జగన్ చెక్ పెడితే బాగుంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజల్లో కూడా ఏపీపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విశాఖను ఐటీ హబ్ లా జగన్ సర్కార్ మార్చే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
జగన్ సర్కార్ చేయాల్సిన అతి ముఖ్యమైన పనులలో ప్రజల్లో వ్యతిరేకత తగ్గించుకోవడం కూడా ఒకటి. ప్రస్తుతం ప్రజల్లో ఊహించని స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండగా జగన్ సర్కార్ ఏం చేయనుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ ఈ మూడు పనులు చేస్తే మాత్రం టీడీపీ జనసేన కలిసినా ఎన్నికల ఫలితాలలో మార్పు అయితే ఉండదని చెప్పవచ్చు.