AP: జగన్ షర్మిల కోసమే సాయిరెడ్డి రాజీనామా చేశారా…. పథకం ప్రకారమే జరిగిందా?

AP: ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిత్యం ఏదో ఒక సంఘటనతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటూనే ఉంటాయి. ఇకపోతే వైకాపా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల కాలంలో వైకాపాలో కీలక పాత్ర పోషించినటువంటి సాయి రెడ్డి రాజీనామా చేయడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.

ఇక సాయి రెడ్డి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఏ పార్టీకి నాకు సంబంధం లేదు అంటూ ఈయన రాజీనామా చేశారు అయితే ఈయన రాజీనామా అనేది పథకం ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి షర్మిల కోసమే ఈయన రాజీనామా చేశారు అంటూ మరొక వార్త వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా ఈ అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ ఆస్తుల విషయమై వీరిద్దరూ బహిరంగంగా మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు ఇక షర్మిల మాత్రం తనని తన అన్నయ్య సొంత బిడ్డలా చూసుకున్నప్పటికీ ఆమె మాత్రం తన అన్నయ్య ఓటమి లక్ష్యంగా పనిచేశారు. ఎన్నికలకు ముందు ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల తాను గెలవడం కంటే తన అన్నయ్యని ఓడించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ఇలా వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోతున్న నేపథ్యంలో అది వారి రాజకీయ వ్యక్తిగత భవిష్యత్తుకే ప్రమాదమని గ్రహించిన వైఎస్ విజయమ్మ వీరిద్దరి విషయంలో విజయసాయిరెడ్డి సహాయం కోరిందట. వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా ఉంటూ వీరి సమస్యలను పరిష్కరించి వారిద్దరిని ఒకే తాటిపైకి తీసుకురావాలని విజయసాయిరెడ్డిని కోరాడట అయితే రాజకీయాలలో ఉంటే అది అసాధ్యమని భావించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా చేసి ఎంతో స్వేచ్ఛగా అందరితో కలిసి తిరుగుతున్నారు.

ఇటీవల షర్మిలను కూడా కలిసి ఈయన ఏపీ రాజకీయాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ఇలా తన అన్నయ్య గురించి మంచిగా చెబుతూ తిరిగి వీరిద్దరీ మధ్య రాజీ కుదుర్చుడానికే సాయి రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇక ఈయన ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్న 2029 ఎన్నికలకు తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది. మరి సాయి రెడ్డి రాజీనామా వెనుక విజయమ్మ ప్లాంట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.