Sai pallavi: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఈమె ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటన నాట్యంతో ప్రేక్షకులను ఫిదా చేసేశారు.
ఇలా వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని సాయి పల్లవి సినిమాలలో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు తమిళంలో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈమె హిందీలో రామాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఈమె సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న హీరోలను డామినేట్ చేస్తూ ఈమె తన పాత్రలకు నటనకు ప్రాణం పోస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే సాయి పల్లవి ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించాలని నిర్ణయం కూడా తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు అనుగుణంగా కథలను కూడా వింటున్నట్లు సమాచారం. ఇక తెలుగులోనే ఈమె తన మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్ ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు ఇక సాయి పల్లవి ఇలాంటి తరహా సినిమాలను చేస్తూ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.