Mohan Babu: కోటా కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు… అందుకే రాలేకపోయానంటూ?

Mohan Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు.. కోటా శ్రీనివాసరావు సుమారు 700కు పైగా సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు.. ఇక ఇటీవల ఈయన వయసు పైబడటంతో పూర్తిగా సినిమా అవకాశాలు కోల్పోయారు. తద్వారా ఇంటికి పరిమితమైన కోటా శ్రీనివాసరావు ఈనెల 13వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇలా కోట మరణ వార్త తెలిసిన ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లే ఆయనకు నివాళులు అర్పించారు.

ఇకపోతే కోటా శ్రీనివాసరావు చనిపోయిన సమయంలో మోహన్ బాబు అతనిని చూడటం కోసం వెళ్లలేదు తాజాగా మోహన్ బాబు కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించడమే కాకుండా కోటా శ్రీనివాస్ తో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్‌లో లేను. కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 1987లో వీరప్రతాప్ సినిమాలో మాంత్రికుడుగా అవకాశం ఇచ్చారు. మా బ్యానర్‌తో పాటు బయట బ్యానర్‌లోనూ ఆయనతో చాలా సినిమాలు చేశానని గుర్తు చేసుకున్నారు.

కోటా శ్రీనివాసరావు గారు ఎంతో అద్భుతమైన నటుడు ఏ పాత్రలో అయినా ఎంతో అవలీలగా నటించేవారు.విలన్‌గా కమెడియన్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో చెప్పగలిగే నటుడు కోట. మా ఫ్యామిలీకి ఆయన అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాదు, సినిమా పరిశ్రమకే తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నానుని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.